రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఆదిపురుష్ టీజర్…!

పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం’ ఆదిపురుష్ ‘ . రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల అయ్యింది.

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో
‘ఆదిపురుష్ ‘ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ఓంరౌత్ , ప్రభాస్, కృతి సనన్ హాజరయ్యారు. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన టీజర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.

టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని ఇండియాలోనే నెం 1 టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో కేవలం 16 గంటల్లోనే 9లక్షల 33వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక తెలుగులో 24 గంటల్లో 63,887,967 వ్యూస్ సాధించింది. ఇక కన్నడలో కూడా 64,008,385 వ్యూస్ , తమిల్ లో 183,217 వ్యూస్ రాగా.. మలయాళంలో 4,350,816 వ్యూస్ సాధించింది. ఇలా సినిమా విడుదలకు ముందే టీజర్ కి అధిక సంఖ్యలో వ్యూస్ రావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. అయితే మరో వర్గం వారు ఈ టీజర్ పై విమర్శలు కూడా చేస్తున్నారు.