యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఉదయం ప్రీమియర్ షోలతోనే థియేటర్స్ లో సందడి మొదలైంది నార్త్, సౌత్ అంతటా ఇప్పుడు ఆదిపురుష్ మానియా నడుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై శ్రీరాముడిగా ఎలా ఉన్నాడో చూడాలని అభిమానులు అందరూ ఆసక్తిగా తరలి వెళ్ళారు.
సినిమాకి అయితే సోషల్ మీడియాలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో 1 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. యూఎస్ లో పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారంట. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 800కె డాలర్స్ మార్క్ ని అందుకుందని టాక్
ఇక 1 మిలియన్ మార్క్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆదిపురుష్ సినిమా అందుకుంటే కచ్చితంగా అది సెన్సేషనల్ రికార్డు అవుతుంది. అయితే యూఎస్ లో రెగ్యులర్ డిస్టిబ్యూటర్స్ ని భూషణ్ కుమార్ మూవీ ఇవ్వకుండా సొంతగానే రిలీజ్ చేస్తున్నారు. ఈ కారణంగా రిలీజ్ విషయంలో సరైన ప్లానింగ్ లేకపోవడం వలన బుకింగ్స్ లేట్ కావడం వలన కొంత గందరగోళం ఏర్పడింది.
అయిన కూడా యూఎస్ లో ఉన్న ఇండియన్ ఆడియన్స్ ఆదిపురుష్ చిత్రాన్ని చూడటం కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కై పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలోనే భారీగానే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో 45 కోట్ల టార్గెట్ తో ఆదిపురుష్ రిలీజ్ అయ్యింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈ కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం అయితే కాదు.
మరి థియేటర్స్ లో ఆదిపురుష్ సందడి మొదలైన నేపథ్యంలో మరికొన్నిగంటల్లో పూర్తిస్థాయిలో రిజల్ట్ ఏంటి అనేది బయటకి వచ్చేస్తుంది. కొంతమంది యాంటీ ఫ్యాన్స్, యాంటీ హిందూస్ ఆదిపురుష్ చిత్రాన్ని నెగిటివ్ గా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోన్న మరో వైపు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది.