రికార్డు ధరకు.. ఆదిపురుష్ ఓటీటీ రైట్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. మంగళవారం తిరుపతి వేదికగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. కాగా, మరో పది రోజుల్లో అంటే జూన్ 16వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ మూవీ విడుదలకు ముందే రికార్డుల క్రియేట్ చేస్తోంది.

ఇటీవల ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ లో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థ్రియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడిపోయినట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ఓటీటీ రైట్స్ విషయంలోనూ రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం. భారీ రేటుకి ఓటీటీ రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది.

ఓటీటీ రైట్స్ ని ఎవరు కొనుగోలు చేశారు అనే విషయం అయితే బయటకు రాలేదు. కానీ దాదాపు రూ.250కోట్లకు కొనుగోలు చేసిందనే ప్రచారం మదొలైంది. అదే నిజం అయితే, ఈ మూవీ ఈ విషయంలో రికార్డులు క్రియేట్ చేసినట్లు. ఎందుకంటే మూవీ బడ్జెట్ రూ.500కోట్లు కాగా, వాటిలో 90శాతం కేవలం థియేట్రికల్, ఓటీటీల రూపంలో రావడం అంటే మామూలు విషయం కాదు. ఎలా చూసుకున్నా ఈ మూవీ నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నట్లే. లాభాలు విడుదలకు ముందు నుంచే కనపడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ని రాముడిగా చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ని చూసేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఊగిపోయారు. వర్షాన్ని కూడా లెక్క చేయలేదు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

ఇక, ఈ ఆది పురుష్ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. 3డీ ఫార్మాట్‌లో విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో యువీ క్రియేష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని మొదట కేవలం ఐదు భాషల్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, తర్వాత పది భాషల్లోకి మార్చారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తుండగా, రావణ బ్రహ్మగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండటం విశేషం.