బిగ్ అప్డేట్ : అంచనాలు పెంచేస్తున్న “ఆదిపురుష్”.!

దాదాపు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర ఓ భారీ సినిమా వచ్చి అయితే చాలా కాలం అయ్యిందని చెప్పాలి. రావడానికి పాన్ ఇండియా సినిమా దగ్గర చాలానే సినిమాలు వస్తున్నాయి కానీ ఆ రేంజ్ హిట్ గాని లేదా వసూళ్లు గాని నమోదు అవ్వాలి కదా అలాంటి సినిమా అయితే ఈ ఏడాదిలో ఇంకా రాలేదు.

మరి ఇప్పుడు ఫైనల్ గా ఆ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆదిపురుష్” తో రాబోతుంది అని చెప్పాలి. గతంలో ఈ సినిమా ఈత ట్రోల్ కి గురయ్యిందో ఇప్పుడు అంతకు మించి పాజిటివ్ వాతావరణం నెలకొల్పుకుంది. ఇక ఈ మధ్య కాలం లో సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా మంచి ఆసక్తి రేపుతున్నాయి.

ఇక ఇపుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో జానకి దేవిగా నటిస్తున్న కృతి సనన్ పై అయితే ఓ పోస్టర్ సహా మోషన్ పోస్టర్ టీజర్ ని వదిలారు. అయితే ఇది కూడా డెఫినెట్ గా మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని అందరి నుంచి అందుకోవడం విశేషం.

ముఖ్యంగా ఈ మోషన్ పోస్టర్ టీజర్ లో విజువల్స్ చాలా రియలిస్టిక్ గా ఉంది. అలాగే ఇందులో అజయ్ – అతుల్ ల మ్యూజిక్ కోసం చెప్పక్కర్లేదు. ఆ రేంజ్ లో ఉంది. దీనితో ఈ లేటెస్ట్ అప్డేట్ మాత్రం సినిమాపై అంచనాలు పెరిగేలా ఉన్నాయి తప్పితే తగ్గించేలా లేదని చెప్పడంలో సందేహమే లేదు.

కాగా ఈ సినిమాలో రావణుని పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించగా సన్నీ సింగ్ లక్ష్మణునిగా నటించాడు. అలాగే వరల్డ్ వైడ్ ఈ సినిమా ఈ జూన్ 16న 3డి, 4డి ఎక్స్ అలాగే ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ కాబోతుంది.