రానున్న మరికొన్ని రోజుల్లో భారీ చిత్రాలు పాన్ ఇండియా సినిమా దగ్గర పలకరించనున్నాయి. మరి ఈ చిత్రాల్లో స్టార్ హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ నటిస్తున్న ప్రతి చిత్రం కూడా ఉండగా వాటిలో తాను ఓకే చేసిన ఆల్ మోస్ట్ అన్ని చిత్రాలు కూడా ఓ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.
ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ ఆల్రెడీ ఒకే చేసిన చిత్రాల్లో ఇంకా చేయాల్సి ఉన్న చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కూడా ఉన్నాడు. హిందీ సినిమా దగ్గర ఏక్షన్ సినిమాలకి స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ దర్శకుడు ప్రభాస్ సహా మన తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రి మేకర్స్ తో చేయాల్సి ఉంది.
అయితే ఇదే అఫీషియల్ అని ఎక్కడ రాలేదు బట్ నిర్మాతలు సిద్ధార్థ్ ఆనంద్ తో చేసుకున్న ఒప్పందం అయితే ఉంది. కాగా ఈ సినిమా ప్రభాస్ తో అని ఎక్కడ రాలేదు కానీ కాంబినేషన్ అయితే ఇదే అని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్ కి హ్యాండిచ్చినట్టుగా తెలుస్తుంది.
కాగా ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన హిందీ చిత్రం “ఆదిపురుష్” ఘోరమైన ఫలితాన్ని చూసింది. దీనితో ఇక హిందీ దర్శకులతో అయితే తాను వర్క్ చేయకూడదు అని డిసైడ్ అయ్యినట్టుగా ఇప్పుడు ఊహాగానాలు మొదలయ్యాయి. దీనితోనే సిద్ధార్థ్ ని తప్పించారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక తన స్థానంలో ఓ తమిళ దర్శకుడు రావచ్చని భోగట్టా.