“ఆదిపురుష్” తర్వాత ఆ డైరెక్టర్ సినిమా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు ఆసక్తికర భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలలో అల్రెడీ షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం కూడా ఒకటి ఉంది. మరి ఆ సినిమానే “ఆదిపురుష్”.

బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా ప్రభాస్ ని రామునిగా కృతి సనన్ ని జానకి దేవి పాత్రలో నటింపజేసిన ఈ చిత్రం భారీ స్థాయిలో ఏకంగా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కి సిద్ధం అవ్వనుంది. మరి ఈ భారీ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉండగా దర్శకుడు రౌత్ అయితే చాలా జాగ్రత్తగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

మరి ఈ చిత్రం తర్వాత ఓంరౌత్ ఏ సినిమా చేస్తాడో అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇది గాని తెలిస్తే డెఫినెట్ గా షాకవ్వాల్సిందే అని చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత ఓంరౌత్ అయితే భారతీయ ఫస్ట్ సూపర్ హీరో “శక్తి మాన్” సినిమా చేయనున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ వారు అనౌన్స్ చేయగా మిగతా వివరాలు రివీల్ చెయ్యలేదు. ఇప్పుడు అయితే ఈ చిత్రంకి గాను దర్శకునిగా ఓంరౌత్ ఫిక్స్ అయ్యినట్టుగా టాక్. ఇంకా దీనిపై మాత్రం అధికారిక క్లారిటీ రావాల్సిందే.