పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారి పౌరాణిక చిత్రం చేశారు. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి ఎదురు చూశారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, గ్రాఫిక్స్ మొదట చేసిన చాలా మంది నచ్చలేదని పెదవి విరచడంతో, దానికోసం మళ్లీ కసరత్తులు చేశారు. దీంతో, మూవీ చాలా ఆలస్యమైంది. ఆలస్యం అయితేనేం ఈరోజు ఎట్టకేలకు విడుదలైంది.
ప్రభాస్ శ్రీరామ చంద్రుడిగా ఎలా ఉంటాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూశారు. నేడు ఆయనను రామావతారంలో చూసి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదట మూవీ టీజర్ విడుదల చేసినప్పుడు బాలేదని విమర్శించినవారంతా, ట్రైలర్ ఛూశాకా అద్భుతమని కామెంట్ చేశారు.
ఆదిపురుష్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంది. ముఖ్యంగా నార్త్ జనాలకు ఈ సినిమా బాగా ఎక్కేసింది. ప్రభాస్ ని అలా మొదటి సారి చూడటం వారికి బాగా నచ్చింది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా సాగాయట. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణంలా మారిందట. ఇక సీతా మాతగా కృతి సనన్ నటనకు వంక పెట్టేవారు లేరు. కళ్లతోనే ఎక్స్ ప్రెషన్స్ పండించి ఆహా అనిపించింది.
అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు ఈ మూవీపై విమర్శలు కూడా వస్తున్నాయి. గ్రాఫిక్స్ అంత బాగా లేవని, తాము విన్న రాముని కథలా లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చిన్న పిల్లల సినిమాలా ఉందని, చిన్న పిల్లలకు బాగా నచ్చుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ వినపడుతోంది.
ఇదిలా ఉండగా, ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. బుక్ మై షో లో ఆన్ లైన్ బుక్సింగ్స్ మోత మోగిపోతున్నాయి. బుక్ మై షో అయితే అడ్వాన్స్ సేల్స్ కి గాను అన్ని భాషల్లో కలిపి ఏకంగా 1.5 మిలియన్ టికెట్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురవడం మాత్రం ఖాయం అని తెలుస్తోంది.