కోయంబత్తూర్ లో పూజలు చేయించిన నటి త్రిష.. ఎందుకంటూ ఆరాలు తీస్తున్న నెటిజన్స్!

అందాల భామ త్రిష తమిళ నటుడు సూర్యతో కలిసి 20 సంవత్సరాల తర్వాత సూర్య 45 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న సినిమా లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్లో కూడా జాయిన్ అయింది. అయితే ఈ అమ్ముడు ఈ సంవత్సరం తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 22 సంవత్సరాలలో ఆమె అనేక ఒడిదుడుకులని ఎదుర్కొంది. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది అలాగే అట్టర్ ప్లాప్ సినిమాల రుచి కూడా చూసింది. అయినా తన ప్రయాణం ఎక్కడ ఆగకుండా చూసుకుంది.

నిజానికి తనతో వచ్చిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు కాస్త వెనకబడ్డారు కానీ త్రిష చేతిలో ఇప్పటికీ ఐదు, ఆరు సినిమాలు ఉండటం గమనార్హం. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఇప్పటికీ ఈమె అభివాహిత కావటం విశేషం. ఒకసారి వివాహం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది కానీ అనివార్య కారణాల వలన ఆ నిశ్చితార్థం ఆగిపోయింది. తర్వాత ఆమె పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు.

కానీ ఈ మధ్య తమిళ్ హీరో విజయ్ తో ఆమె క్లోజ్ గా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా కెరీయర్ మీదే తన దృష్టి ఉంచిన త్రిష సూర్య 45 సినిమా షూటింగ్ లో ఈ మధ్యనే జాయిన్ అయింది ఈ సందర్భంగా అక్కడ కోయంబత్తూర్ లోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్ ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంది.

ఆమె గుడిలో పూజలు చేయించుకుంటున్న సమయంలో ఆమెని చూసేందుకు జనాలు ఎగబడ్డారు, ఆమెతో ఫోటోలు తీయించడానికి ఉత్సాహం చూపించారు. త్రిష వాళ్ళ అందరితో కాసేపు గడిపిన తర్వాత బయటికి వచ్చేసింది. అయితే త్రిష పూజలు చేయించుకోవడం పట్ల కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు పెళ్లి కోసమా కెరియర్ కోసమా లేదంటే విజయ్ తో రిలేషన్ కంటిన్యూషన్ కోసమా అంటూ సెటైర్లు వేస్తున్నారు.