ఒక్కొక్కడి గుట్టూ ఇప్పుతున్న సమీరా రెడ్డి.. టాప్ హీరోల బాగోతం బయటకి ?

actress sameera reddy about casting couch

నటి సమీరా రెడ్డి మీకు గుర్తుందా? ఇప్పుడు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో నటించింది సమీరా రెడ్డి.

actress sameera reddy about casting couch

తెలుగులో అగ్ర హీరోల సరసన కూడా నటించింది సమీరా. చిరంజీవితో జైచిరంజీవ సినిమాలో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ తోనూ అశోక్ సినిమాలో నటించింది.

సూర్య సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలోనూ సమీరా రెడ్డి నటించి అందరి ప్రశంసలు అందుకున్నది సమీరా. ఇటీవలే బేబీకి జన్మనిచ్చి ప్రస్తుతం అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తున్న సమీరా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని బాధను బయటపెట్టింది.

తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి. తన అనుభవాలను తన మాటల్లోనే విందాం  రండి..

actress sameera reddy about casting couch

అప్పుడు నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నా. సెట్ లోనే ఉన్నా. ఓ సీన్ చేయాల్సి ఉంది. సడెన్ గా ఏమైందో కానీ.. చేయాల్సిన సీన్ కాకుండా స్క్రిప్ట్ మార్చి ఓ ముద్దు సీన్ ను పెట్టారు. ముందు చెప్పిన స్క్రిప్ట్ లో ఆ సీన్ లేదు కదా.. ఇప్పుడు కొత్తగా ఈ సీన్ ఏంటి? నేను చేయను.. అని తెగేసి చెప్పా. అంతే.. మీరు కొంత సమయం ఇస్తాం.. ఆలోచించుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. మీ స్థానంలో వేరే వాళ్లు వస్తారు.. అంటూ మూవీ యూనిట్ నన్ను హెచ్చరించినంత పని చేశారు.. అంటూ తన బాధను బయటపెట్టింది సమీరా రెడ్డి.

సినీ పరిశ్రమలో అందరూ మంచోళ్లు ఉండరు. అలాగని అందరూ చెడ్డోళ్లు కూడా ఉండరు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో సినిమాలను వదిలేసుకున్నా. పార్టీ కల్చర్ కు అలవాటు పడాలి. షూటింగ్ అయిపోగానే పార్టీ కల్చర్ కు అలవాటు పడ్డవాళ్లకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బాలీవుడ్ లో ఓ సినిమాకు  సైన్ చేశాక.. తీరా నిర్మాత వచ్చి.. నువ్వు ఆ పాత్రకు సరిపోవు. ఆ పాత్రలో వేరే హీరోయిన్ ను తీసుకున్నాం.. అని చెప్పి వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో నెపోటిజం చాలా ఎక్కువ. అయినా కూడా.. నేను నా పరిధి మేరకు నటించాను. ఎన్నో మంచి పాత్రల్లో నటించా. అందుకే.. ఇప్పటి వరకు కూడా చిత్ర పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడలేదు.. అంటూ సమీరా కన్నీటి పర్యంతమైంది.