సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో రోజా ఒకరనే సంగతి తెలిసిందే. 2014, 2019 సంవత్సరాలలో వైసీపీ నుంచి నగరి తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా ఆస్తుల విలువ ఏకంగా 7 కోట్ల 38 లక్షల రూపాయలు కావడం గమనార్హం. సినిమాల ద్వారా రోజా ఈ మొత్తాన్ని సంపాదించారని తెలుస్తోంది.

రోజా ఆస్తులలో స్థిరాస్థుల విలువ 4 కోట్ల 64 లక్షల రూపాయలు కాగా చరాస్థుల విలువ 2 కోట్ల 74 లక్షల రూపాయలు కావడం గమనార్హం. రోజా తన కొడుకు, కూతురు పేర్లపై 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. నగరి ఎమ్మెల్యే రోజాకు కార్లు అంటే కూడా ఎంతో ఇష్టం కావడం గమనార్హం. రోజాకు కార్లు అంటే ఎంతో ఇష్టం కాగా ఆమె దగ్గర ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయని సమాచారం అందుతోంది.

రోజా భర్త సెల్వమణి పేరుపై ఎలాంటి స్థిరాస్థులు లేవు. చరాస్థులు మాత్రం 58 లక్షల 2 వేల రూపాయలుగా ఉండటం గమనార్హం. అప్పులు 22 లక్షల రూపాయలుగా ఉండగా సెల్వమణి ఇండస్ట్రీలో దర్శకునిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. మరోవైపు రోజా మంత్రి పదవి దక్కడంతో టీవీ షోలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఇంద్రజ ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

జబర్దస్త్ షోకు మనో మరో జడ్జి కాగా కొన్నిసార్లు మనో ఈ షోకు హాజరైతే మరి కొన్నిసార్లు మనోకు బదులుగా ఇతర హీరోయిన్లు జడ్జిగా హాజరవుతున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. రోజాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రోజా భవిష్యత్తులో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.