వెండితెరపై మనం చూసే పాత్రలు, వాటిని పోషించే పాత్రధారులు.. నిజ జీవితంలో వారు కనిపించే దానికి ఎంతో తేడా ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఇందుకు చక్కటి ఉదాహరణ. స్టార్ హీరోలందరికీ అమ్మగానో, అత్తగానో నటించి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మోడ్రన్ మదర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈమె పోషించిన పాత్రలు చూసి.. రియల్‌గా కూడా ఇలానే ఉంటుందా? అని అనకుంటే అది పొరబాటే.
లాక్‌డౌన్‌లో తెలుగు నటీనటుల్లో ప్రగతి అంతా క్రేజ్ సంపాదించుకున్నవారు గానీ, అంత పాపులర్ అయిన వారు గానీ మరొకరు లేరు. సోషల్ మీడియాలో ప్రగతి చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతంది. లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పులు వేసినా, క్లాస్ సాంగ్‌కు క్లాసికల్ డ్యాన్సులు వేస్తూ వయ్యారాలను ఒలకబోసినా అది ప్రగతికే సొంతం.
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని, అయితే తెరపై తన ప్రతిభను చూపించుకునేందుకు అంతగా అవకాశం రాకపోవడంతో సోషల్ మీడియాలో ఇలా చేస్తోన్నానని ప్రగతి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ వయసులోనూ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ.. శక్తికి మించిన బరువులు ఎత్తుతూ, ఆశ్చర్యం కలిగించే వర్కౌట్లు చేస్తోంది. ఇలా ఎంతో మందిలో స్ఫూర్తినింపుతూ ముందుకు సాగుతోంది. ఏది ఏమైనా ప్రగతి మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.