కరోనా, లాక్ డౌన్ కాలంలో ఎక్కువగా ఫేమస్ అయిన నటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రగతి మాత్రమే. తెరపై ఎంత హోమ్లీగా, మోడ్రన్ మదర్‌గా, అత్తగా ఎంతో చక్కగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. యంగ్ హీరోయిన్‌లకు ఏమాత్రం తగ్గని అందం తనదని నిరూపించింది. మెలికలు తిరుగుతూ వేసిన డ్యాన్స్ మూమెంట్స్, లుంగీ కట్టుకుని వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి.
ఇక ప్రగతి చేసే వర్కౌట్లు, జిమ్ వీడియోలు, బరువులు ఎత్తే వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాయి. ఫిట్ నెస్ మెయింటేన్ చేయడంతో ప్రగతికి సాటి ఎవ్వరూ లేరని నిరూపించింది.లాక్ డౌన్‌లో ప్రగతి వైరల్ అయినంతగా మరేతర నటీమణులు కూడాలేదు. ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ, తన వ్యక్తిగత జీవితంలో సంఘటనల గురించి చెప్పిన సంగతులు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి.
ఇక టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే షూటింగ్‌ల సందడి మొదలైంది. ఒక్కొక్కరుగా అందరూ సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. చాలా కాలం తరువాత పని చేస్తుండటంతో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రగతి ఓ సినిమాలో కామెడీ సీన్ ద్వారా చెప్పింది. ఎంజాయ్ చేయాల్సిన రోజులు అయిపోయాయ్ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోన్న వీడియోను షేర్ చేయడంతో పాటు.. లాక్ డౌన్ వంటి లాంగ్ గ్యాప్ తరువాత పనిలోకి వెళ్లాలంటే ఇలాంటి ఫీలింగే కలుగుతుంది కదా అని చెప్పుకొచ్చింది. అయితే ప్రగతి ఇకపై సెట్‌లో సందడి చేయబోతోందన్న మాట. మరి ఇప్పటి నుంచి అయినా తనకు కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తాయేమో చూడాలి.