‘పెళ్లి సందడి’లో ప్రగతి.. కొత్త గెటప్‌లో అదరగొట్టేసింది!

Actress Pragathi in Peeli sandhadi movie

శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఓ చరిత్ర. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు సృష్టించిన ఓ దృశ్యకావ్యం. కీరవాణి తన బాణీలతో చేసిన అద్బుతమే పెళ్లి సందడి. అలాంటి పెళ్లి సందడికి సీక్వెల్ రాబోతోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పెట్టి పెళ్లి సందడి అనే సినిమాను తీయబోతోన్నారు. ఈ మేరకు వదిలిన అప్డేట్లు, రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు అన్నీ కూడా బాగానే క్లిక్ అయ్యాయి.

Actress Pragathi in Peeli sandhadi movie
Actress Pragathi in Peeli sandhadi movie

అయితే పెళ్లి సందడి సినిమా అంటే టైటిల్‌కు తగ్గట్టే తెర నిండా భారీ తారాగణం ఉండాల్సిందే. స్క్రీన్ అంతా సందడి సందడిగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పెళ్లి సందడి సినిమాలో భారీ తారాగణం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ చిత్రంలో నటి ప్రగతికి మంచి పాత్రే దక్కినట్టుంది.

తాజాగా ప్రగతి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పెళ్లి సందడి మూవీ కోసం ప్రగతి మళ్లీ తన పాత క్యారెక్టర్‌లోకి వెళ్లింది. సంప్రదాయ బద్దమైన తల్లి క్యారెక్టర్‌ను ప్రగతి పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె షేర్ చేసినఫోటోలు ప్రస్తుతం బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పెళ్లి సందడి సినిమాకు రాఘవేంద్ర రావు కేవలం సూపర్ వైజ్ మాత్రమే చేస్తున్నారని చెబుతున్నా కూడా అంతా ఆయన నేతృత్వంలోనే జరుగుతోందట.