నటి ప్రగతి సోషల్ మీడియా ఏ రేంజ్‌లో హల్చల్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రగతి అంటే మోడ్రన్ మదర్, అత్తగా వెండితెరపై పండించిన ఎమోషన్స్‌ను చూసి ఫిదా అయి ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రగతిని చూసి అంతకు మించి ఫిదా అయి ఉంటారు. వెండితెరపై కనిపించే ప్రగతికి.. ఇప్పుడున్న ప్రగతికి ఎంతో తేడా ఉంది. కరోనా, లాక్డౌన్ వల్ల ప్రగతి ఇమేజ్ అమాంతం పెరిగింది. ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది.
లాక్డౌన్‌లో ప్రగతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. డ్యాన్స్ వీడియోలతో ప్రగతి ఓ ఊపు ఊపేసింది. ఎక్స్ పోజింగ్ చేస్తూ లుంగీ కట్టి డ్యాన్సులు వేస్తే సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. ఇక డ్యాన్సులే ఒకెత్తు అనుకుంటే ప్రగతి చేసే హెవీ వర్కవుట్లు కూడా తెగ వైరల్ అయ్యాయి. నాలుగు పదుల వయసున్నా కూడా ప్రగతి ఇంత ఎనర్జీగా ఉండటం,వర్కవుట్లు చేయడంతో అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు ఆమెకు మునుపటిలా ఏడుపుగొట్టు పాత్రలు రావడం లేదు.
ప్రగతి తన ఇద్దరి పిల్లలతో ఒంటరిగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రగతి కూతురు నేడు పదహారు ప్రాయంలోకి అడుగుపెట్టింది. 16వ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. ఇకపై నిన్ను ఏడిపించను అంటూ.. స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పింది. పబ్‌లో ఈ పార్టీని ప్రగతి గ్రాండ్‌గా నిర్వహించగా.. అందులో ఆమె వేసుకున్న డ్రెస్, అందాల ఆరబోత ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రగతి తన కూతురు, కొడుకుతో చేసిన రచ్చ హల్చల్ అవుతోంది.