30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. సత్యదేవ్ వద్దన్న సినిమాను యాంకర్ ప్రదీప్ ఎందుకు చేశాడు?

యాంకర్ ప్రదీప్ కు ప్రస్తుతం ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలుసు. బుల్లితెర మీదనే కాకుండా అప్పుడప్పుడు వెండి తెర మీద కూడా ప్రదీప్ అలరిస్తున్నాడు. ఆయన షోలకు యాంకరింగ్ చేయడమే కాకుండా.. సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ సినిమా కరోనా కంటే ముందే పూర్తయినప్పటికీ.. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో సినిమా రిలీజ్ కాలేదు.

Actor Satyadev Shocking Comments On Anchor Pradeep Movie
actor satyadev shocking comments on anchor pradeep movie

అయితే.. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకుంటుండగా… ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన నీలి నీలి ఆకాశం పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Actor Satyadev Shocking Comments On Anchor Pradeep Movie
actor satyadev shocking comments on anchor pradeep movie

ఇక.. అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరోగా ముందు యాంకర్ ప్రదీప్ ను అనుకోలేదట. ఈ సినిమా కోసం ముందుగా హీరో సత్యదేవ్ ను మూవీ యూనిట్ సంప్రదించిందట. అయితే.. ఆ సినిమాను సత్యదేవ్ చేయను.. అని చెప్పాడట. ఆయన వద్దన్నాక.. ఈ కథను ప్రదీప్ కు వినిపించడం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయట.

Actor Satyadev Shocking Comments On Anchor Pradeep Movie
actor satyadev shocking comments on anchor pradeep movie

అంటే.. సత్యదేవ్ వద్దనుకున్న సినిమాను యాంకర్ ప్రదీప్ చేశాడన్నమాట. ఈ విషయం ఆలీతో సరదాగా.. అనే ప్రోగ్రామ్ లో ఆలీతో సత్యదేవ్ చెప్పడంతో తెలిసింది. అయితే ప్రోమోలో దీని గురించి ఆలీ, సత్యదేవ్ మాట్లాడారు.

అసలు ఏం జరిగింది.. అనేది తెలియాలంటే.. ఆ ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా ఆగాల్సిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles