నరేషా.! పబ్లిసిటీ కోరుకున్నది నువ్వేగా.?

‘మా బెడ్రూమ్‌లోకి తొంగి చూసే హక్కు మీకెక్కడిది.?’ అంటూ సినీ నటుడు నరేష్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. తనపై జరుగుతున్న ట్రోలింగ్ నేపథ్యంలో పోలీసుల్ని ఆశ్రయించాడాయన. పోలీసులకు ఫిర్యాదు చేయడం అన్నది పాత వ్యవహారమే. కాకపోతే, కొత్తగా ఆధారాలు సేకరించాడట ఆయన.

పోలీసులు కదా ఆధారాలు సేకరించాల్సింది.? ఏమో, ఈ కథేంటో ఎవరికీ అర్థం కావడంలేదాయె. సీనియర్ నటి పవిత్ర లోకేష్‌తో సీనియర్ నటుడు నరేష్ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడు. వీరిద్దరి ‘ఎఫైర్’ గురించి స్వయంగా నరేష్ భార్య రమ్య రఘుపతి తీవ్ర ఆరోపణలు చేయడం చూశాం.

రమ్య రఘుపతిపై నరేష్ కూడా జుగుప్సాకరమైన ఆరోపణలే చేశాడు. పైగా, నరేష్ – పవిత్ర లిప్ లాక్ వీడియో.. స్వయంగా నరేష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వదిలాడు. గాసిప్స్‌కి ఆస్కారం కల్పించి పబ్లిసిటీ స్టంట్లు చేసిందే ఆయన.

మళ్ళీ ఆ నరేషే తాను బాధితుడ్ని అంటున్నాడు. ఇదెక్కడి చోద్యం.? అని సినీ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.