కోట్లు పోయాయ్.! ఛీవాట్లు మిగిలాయ్.!

‘మళ్లీ పెళ్లి’ అంటూ పెద్ద ఎత్తున కోట్లు ఖర్చు పెట్టేసి సినిమా తీసేశాడు సీనియర్ నటుడు నరేష్. ఇదేం పైత్యమో కానీ, ముదురు వయసులో రాకూడని కోరిక పుట్టింది నరేష్‌కి. తన బయోపిక్‌నే అడ్డదిడ్డమైన రొమాన్స్‌తో నింపేసి సినిమా తీసేసుకున్నాడు.

రియల్ లైప్‌లో జరుగుతున్న పైత్యపు లొల్లిని రీల్ లైఫ్‌లో తగలెట్టేసి జనం నెత్తిన బలవంతంగా రుద్దేసే ప్రయత్నం చేశాడు. సినిమా తీసేశాడు. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ స్టంట్లు చేశాడు.

కొన్ని కోట్లు కుమ్మరించి మరీ సినిమాని ప్రమోట్ చేశాడు. వివాదాలు చుట్టుముట్టినా.. జనం ఛీకొట్టినా సినిమా అయితే రిలీజ్ చేసేశాడు. ఎంతో మంచి కంటెంట్ వుంటే తప్ప ధియేటర్లకు రావడం లేదు జనాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనగారి పైత్యాన్ని ఎంత కోట్లు ఖర్చు పెట్టి జనాలపై రుద్దేయ్యాలనుకుంటే మాత్రం వర్కవుట్ అయితే కదా.

జరగాల్సిందే జరిగింది. కోట్లు బూడిదలో పోసిన పన్నీరైపోయాయ్. డబ్బులు పోయాయని పైకి చెప్పుకోలేడు. దారుణంగా నష్టపోయాడు. చివరికి జనాల నోళ్లలో పడి ఛీవాట్లు తింటున్నాడు. ‘మళ్లీ పెళ్లి’.. ఈ ముదురు ప్రేమ చాలా కాస్ట్‌లీ గురూ.!