క్యాన్సర్ తో నాడు గుండుతో.. నేడు హెయిర్ తో స్టైలిష్ గా

టాలీవుడ్ నటి హంసా నందిని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పెషల్ సాంగ్స్, ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ లో నర్తించి మెప్పించిన ఈ హాట్ బ్యూటీ నటిగా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. మా స్టార్స్ పత్రిక, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ లకు ప్రచార కర్తగా కూడా పని చేసిన ఈ ముద్దుగుమ్మ ఏడాది క్రితం క్యాన్సర్ బారిన పడింది. 2021లో హాంసా నందినికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్లు తేలింది. అయితే 16 సైకిళ్ల కీమో థెరఫీ తీసుకున్న ఈమె ఏడాదికి కోలుకుంది.

అయితే క్యాన్సర్ కారణంగా జుట్టంతా ఊడిపోయి గుండుతో కనిపించింది. చాలా కాలం పాటు తన గ్లామర్ లుక్ కి హంసానందిని దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ముందటి జోష్ తో వచ్చేసింది. ఈ క్రమంలోనే జుట్టు పెరిగిన ఫొటోలతో చాలా హాట్ గా కనిపిస్తుంది. గతంలో గుండుతో ఉన్నప్పటి వీడియోతో పాటు ఇప్పుడు జుట్టు ఉన్న వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేసింది. అందులో హంసానందిని చాలా అందంగా కనిపిస్తోంది.

వన్ ఇయర్ ఎగో అంటూ గుండుపై కనిపించిన ఈ హాట్ బ్యూటీ.. ఏడాది తర్వాత హలో హెయిర్ అంటూ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అందులో జుట్టుతో ఉన్న హంసా చాలా స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది. ఇన్ స్టా వేదికగా 6.19 లక్షల ఫాలోవర్లను కల్గిన ఈ బ్యూటీ ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోపే వేలాది లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకొని.. అదే జోష్ తో మీరు బయటకు రావడం సంతోషంగా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

క్యాన్సర్ కు ముందు ఎంత హాట్ గా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తున్నావని ఓ నెటిజెన్ చెప్పగా.. మీరు రియల్ ఫైటర్ అంటూ మరో అభిమాని చెప్పుకొచ్చాడు. మీ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నామని కొందరు అంటుండగా.. జుట్టు లేకున్నా మీరు రాణిలా కనిపిస్తున్నారని మరికొంత మంది అంటున్నారు. అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం, లెజెండ్ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో ఊపేసిన ఈ హాట్ బ్యూటీ మళ్లీ ఆఫర్ వస్తే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.