సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తూ ఉంటారు నెటిజన్స్. అందులో నిజం ఎంత, కల్పితం ఎంత, అవతలి వాళ్ళు ఎంత బాధ పడతారు అనే విషయం కూడా వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట విషయంలో కూడా అదే జరిగింది. గత కొద్ది రోజులుగా పెళ్లి, బర్త్డే వేడుకల్లో ఐశ్వర్య కూతురితో సింగల్ గా కనిపించడంతో ఐశ్వర్య, అభిషేక్ విడిపోతున్నారు, వారిద్దరికీ డైవర్స్ కన్ఫర్మ్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
అయితే ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టారు బచ్చన్ జంట. గత నెలలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ 13వ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ పార్టీలో అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. బర్త్డే పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలం లకి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు ఈమధ్య ఫిలిం ఫేర్ ఓ టి టి అవార్డుల ఈవెంట్ కి హాజరైన అభిషేక్ బచ్చన్ భర్తలకి ఒక సలహా ఇచ్చాడు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాట వినాలని, ఇంట్లో నేను అదే చేస్తున్నానని చెప్పడంతో షాక్ అవడం నెటిజన్స్ వంతు అయింది. ఇంకా అభిషేక్ బచ్చన్ ఏం మాట్లాడారంటే ఆరాధ్యను ఇంత సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్య కి కృతజ్ఞతలు తెలిపారు.
బయటకు వెళ్లి సినిమాలు చేయటం నా అదృష్టం, ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసు అంటూ భార్యపై ఉన్న ధీమాని వ్యక్తం చేశారు. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ బచ్చన్ తెలిపారు. నిన్నటి వరకు విడిపోతున్నారు, విడాకులు అయిపోయాయి అనుకున్న జనాలకి అభిషేక్ బచ్చన్ ఇలా మాట్లాడటంతో షాక్ అవుతున్నారు.