విడాకులకు సిద్ధమైన అభిషేక్ బచ్చన్… క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కుమారుడిగా అభిషేక్ బచ్చర్ అందరికీ సుపరిచితమే.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అభిషేక్ నటి ఐశ్వర్యరాయ్ ను 2007వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.ఇలా వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈ దంపతులకు ఆరాధ్య అనే ఒక కుమార్తె కూడా కలదు.ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంటకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన అభిషేక్ బచ్చన్ అప్పట్లో ట్విట్టర్ వేదికగా వీరి విడాకుల వార్తలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి స్పందిస్తూ నేను విడాకులు తీసుకుంటున్నానని నమ్ముతున్నా..ఈ విషయం నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మరి రెండో పెళ్లి కూడా ఎప్పుడు చేసుకోవాలో మీరే చెప్పండి థాంక్యూ అంటూ విడాకులపై స్పందించారు.

ఇదిలా ఉండగా అభిషేక్ బచ్చన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా గతంలో వీరి విడాకుల గురించి వచ్చిన వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఐశ్వర్యతో నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడవ వ్యక్తి నాకు చెప్పేందుకు నేను అంగీకరించను.నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు అంటూ విడాకులు వార్తలపై ఘాటుగా స్పందించారు.ఇలా గతంలో విడాకుల గురించి వచ్చిన వార్తలపై తాజాగా అభిషేక్ మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేస్తూ ఐశ్వర్య పై తనకున్న ప్రేమను బయటపెట్టారు.