బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అవును ఇది నిజం. రాత్రికి రాత్రే అన్నీ రివర్స్ అయిపోతాయి. ఇవాళ ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి రేపు శత్రువు అవుతాడు. ఇవాళ ప్రేమ ఉంటుంది.. రేపు పగ వస్తుంది. అంతా బిగ్ బాస్ మాయ.
ఈ వారం నామినేషన్లతో హౌస్ లో అసలు ఎవరు ఎవరికి ఫ్రెండ్స్.. ఎవరు ఎవరికి శత్రువులు అని క్లారిటీ వచ్చినట్టుంది. ముఖ్యంగా మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఒక పుల్ స్టాప్ పడినట్టు ఉంది. ఎందుకంటే.. నామినేషన్ల కంటే ముందు అఖిల్ తో మోనల్ కు చెడింది. కెప్టెన్సీ టాస్క్ తర్వాత మోనల్, అఖిల్ గొడవపడి బ్రేకప్ చెప్పేసుకున్నారు. తర్వాత నామినేషన్లలోనూ ఓ రేంజ్ లో గొడవ పడ్డారు. నీకు, నీ ఫ్రెండ్ షిప్ కు ఒక దండం తల్లి అంటూ అఖిల్.. మోనల్ ను కట్ చేసేశాడు. మోనల్ కూడా అఖిల్ తో కటీఫ్ చెప్పేసింది.
అంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు కథ ఇప్పుడు ప్రారంభమయింది. అక్కడ అఖిల్ తో కటీఫ్ చెప్పిందో లేదో.. మోనల్ అభిజీత్ తో స్టార్ట్ చేసేసింది. అభిజీత్ నాన్న స్టేజీ మీదికి వచ్చినప్పుడు నాకు మోనల్ అంటే ఇష్టం అని అభిజీత్ నాన్న చెప్పడంతో… అభిజీత్ అదే పాయింట్ ను మోనల్ దగ్గర చెప్పేశాడు.
అసలు నువ్వు మా నాన్నకు నచ్చినవంటే అసలేందో అబ్బ.. అర్థం అయితలేదు.. అంటూ రొమాంటిక్ గా అభిజీత్ చెప్పడంతో… మోనల్ కూడా రొమాంటిక్ గా అభి వైపు చూస్తుంది. అంటే.. బిగ్ బాస్ హౌస్ లో మరో ప్రేమజంట పుట్టిందన్నమాట.
దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయితే కానీ.. వాళ్లిద్దరి మధ్య ఏమున్నది అనే విషయం తెలియదు.