అఫీషియ‌ల్: పెళ్లైన హీరోయిన్‌తో బాల‌య్య రొమాన్స్

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో బీబీ 3( వ‌ర్కింగ్ టైటిల్‌) అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సింహ‌, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బోయ‌పాటి శీను- బాల‌య్య కాంబినేష‌న్‌లో ఈ సినిమా రూపొందుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా, మ‌రి కొద్ది రోజుల‌లో బాల‌య్య త‌న టీంతో క‌ల‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్ర హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యంపై కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తుండ‌గా, దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

హై యాక్ష‌న్ వోల్టేజీ ఎంట‌ర్ టైనర్ గా వ‌స్తోన్న ఈ చిత్రంలో ప్ర‌యాగ మార్టిన్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని టెస్ట్ షూట్‌లో బాల‌య్య‌తో కెమిస్ట్రీ అంత వ‌ర్క‌వుట్ కావ‌డం కావ‌లేద‌ని భావించ‌డంతో మ‌రో హీరోయిన్‌పై దృష్టి పెట్టారు. తాజాగా సాయేషా సైగ‌ల్‌ని ఎంపిక చేసిన‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఈ అమ్మ‌డు అఖిల్ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న లీడ్ హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే

సాయేషా సైగ‌ల్‌.. త‌మిళ హీరో ఆర్య స‌తీమ‌ణి అనే సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు చాలా కాలం త‌ర్వాత మ‌ళ్ళీ తెలుగు సినిమాలో న‌టిస్తుంది. బాల‌య్య‌తో జోడి క‌ట్టనున్న సాయేషా సైగ‌ల్‌ ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని ఆఫ‌ర్స్ పొందాల‌ని అభిమానులు భావిస్తున్నారు. కాగా, సాయేషా సైగ‌ల్ పెళ్లి త‌ర్వాత కూడా మంచి సినిమాల‌తో దూసుకెళుతుంది.. బాల‌య్య గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అఘోరా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. వార‌ణాసి షెడ్యూల్ లో బాల‌కృష్ణ-ప్ర‌గ్యా జైశ్వాల్ పై వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రీక‌రించేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.