ఆర్తీ అగర్వాల్ బయోపిక్.!

ఒకప్పుడు ఆర్తీ అగర్వాల్ అంటే అబ్బో.! పెద్ద స్టార్ హీరొయిన్.. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిందీ అమెరికన్ ముద్దుగుమ్మ.

అలా దక్కించుకున్న స్టార్‌డమ్‌తో ఆ తర్వాత స్టార్ హీరోలూ, యంగ్ హీరోలూ అనే తేడా లేకుండా వరుసగా చాలా సినిమాల్లో నటించేసింది.

ఓ యంగ్ హీరోతో ప్రేమ యవ్వారం బెడిసి కొట్టి కెరీర్‌నీ, ఆఖరికీ జీవితాన్నీ నాశనం చేసుకుంది ఆర్తీ అగర్వాల్. అలాగే ఆ యంగ్ హీరో కెరీర్ కూడా ఇదే కారణంగా నాశనమైపోయింది.

అసలు విషయమేంటంటే, ఆర్తీ అగర్వాల్ బయోపిక్‌ని తెరకెక్కించేందుకు గత కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయ్. అయితే, తెర వెనక కొన్ని శక్తులు ఆ ప్రయత్నాలకు అడ్డు తగులుతూ వస్తున్నాయ్.

కానీ, ఈ సారి ఇంకాస్త గట్టిగా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అచ్చు ఆర్తీ అగర్వాల్‌‌లాగే వుండే హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. అన్నీ కుదిరితే రెండు మూడు నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ సెట్ చేయనున్నారనీ తెలుస్తోంది. .

ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాకి కథ అంందిస్తున్నాడట. మరో యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడట. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా ఈ బయోపిక్‌ని రూపొందించబోతున్నారట.