ముచ్చటగా మూడో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఎంతోమంది హీరో హీరోయిన్లు రెండు మూడు వివాహాలు చేసుకోవడం మనం చూస్తున్నాము. అయితే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడో పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఆ నటుడు ఎవరు అనే విషయానికి వస్తే…బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు వివాహాలు చేసుకొని తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇతను మూడోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దంగల్ సినిమా ద్వారా నటి ఫాతిమా తో అమీర్ ఖాన్ ప్రేమలో పడ్డారని ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఫాతిమా స్పందించారు.ఎవరో గిట్టనివారు మా గురించి ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని తాము ఏ విధమైనటువంటి రిలేషన్ లో లేమని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

2005వ సంవత్సరంలో అమీర్ ఖాన్ కిరణ్ రావు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అమీర్ ఖాన్ ఎలాంటి వివాహం చేసుకోలేదని పూర్తిగా తన దృష్టి మొత్తం సినిమాల పై ఉంచారని నటి ఫాతిమా వెల్లడించారు. ఇక అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా విడుదలకు సిద్ధంగా ఉంది.