చిల్ అవుతోన్న రేణూ దేశాయ్.. అద్య అలా కెమెరాలో బంధించేసిందిగా!!

రేణూ దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చాలా రోజులు తరవాత ఓ సినిమా షూటింగ్‌లొ పాల్గొంది. ఆద్య పేరుతో తెరకెక్కుతోన్న ఈచిత్రంతో నందినీ రాయ్, ధన్సిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథలతో తెరకెక్కోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ సెట్‌లో ఎలా ఉంది? మేకప్ ఎలా వేస్తున్నారు? అన్న సంగతులన్నీ వీడియో రూపంలో షేర్ చేస్తూనే ఉంది.

Aadya clicked Renu Desai pic While chilling

రేణూ దేశాయ్ ఇటు బుల్లితెర, అటు వెండితెరపై, మరో వైపు వెబ్ సీరిస్‌లంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. కానీ తాజాగా రేణూ దేశాయ్ ఫుల్ చిల్ అవుతోన్నట్టు కనిపిస్తోంది. హైద్రాబాద్ వర్షాల గురించి చెబుతూ వాతావరణ ఎలా మారిందో ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ఇక ఆద్యకు ఫోటోగ్రఫీలో ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్ షేర్ చేసే ఫోటోల్లో దాదాపు అన్నీ కూడా ఆద్య తీసినవే ఉంటాయట.

Aadya clicked Renu Desai pic While chilling

తాజాగా రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో రేణూ దేశాయ్ నవ్వుతూ అలా హాయిగా ప్రకృతిని ఆస్వాధిస్తోన్నట్టుగా ఉంది. స్మిమ్మింగ్ పూల్ వద్ద కూర్చుని అలా క్యాజువల్‌గా ఉన్న సమయంలోనే ఆద్య న్యాచురల్‌గా క్లిక్‌మనిపించినట్టుంది. ఆ ఫోటోను చూసి మురిసిపోయిన రేణూ దేశాయ్ ఆద్యపై ప్రశంసలు కురిపించింది. ఆద్య ఆమె అద్బుతమైన ఫ్రేమింగ్ సూపర్ అంటూ నా రాక్ స్టార్ అని పొగిడేసింది.