ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు డిజాస్టర్లు వచ్చాయ్ ప్రబాస్ నుంచి వరుసగా. ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ నటించిన ఏ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదనే చెప్పడం అతిశయోక్తి కాదేమో.
అన్నింట్లోకీ ‘ఆది పురుష్’ దారుణంగా దెబ్బ తీసేసింది ప్రబాస్ కెరీర్‌ని. ఇక, ఇప్పుడు ‘సలార్’ హంగామా మొదలైంది. ‘ఆది పురుష్’ ఇంపాక్ట్ ‘సలార్’ మీద బాగా పడుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అన్న పాజిటివ్ యాంగిల్ తప్ప ఈ సినిమాలో మరే ఇతర బజ్ కనిపించడం లేదు.
దాంతో ఎగ్జిబిటర్లలో అయోమయం కనిపిస్తోంది. హీరో నుంచి గ్యారంటీ కావాలని నిర్మాణ సంస్థ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. గతంలో ‘రాధేశ్యామ్’ విషయంలో ప్రబాస్ ఎగ్జిబిటర్లను కొంత ఆదుకున్నాడు.
కానీ, ‘ఆదిపురుష్’ విషయంలో అలాంటి ఇన్‌ఫామేషన్ లేదనే చెప్పాలేమో. ‘ఆది పురుష్’ నిర్మాతల దగ్గర్నుంచి ఎగ్జిబిటర్ల వరకూ గగ్గోలు పెడుతున్నారు. అయినా మింగలేక, కక్కలేక అన్నట్లుంది పాపం వాళ్ల పరిస్థితి.
నిజంగా చెప్పాలంటే ఇది ప్రబాస్‌కీ కష్టమైన ఫేజే. ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ప్రబాస్ ఎలా బయటపడతాడో.! ‘సలార్’ని ఎలా హిట్టు ట్రాక్ ఎక్కిస్తాడో..! అది ప్రబాస్ చేతుల్లోనూ లేదే.!