నటినటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్, కళ్యాణి నటరాజన్ తదితరులు.
డైరెక్టర్: ఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ సాగర్
కొన్నాళ్లుగా సరైన హిట్ లేని సుధీర్ బాబు, తన ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో మరోసారి ‘ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కోసం జత కట్టాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
ఈ సినిమాలో సుధీర్ బాబు ఒక మూవీ డైరెక్టర్ గా కనిపిస్తాడు. అప్పటికే ఐదు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన నవీన్ (సుధీర్ బాబు) ఈసారి కాస్త ఒక వెరైటీ సినిమా చేయాలని డిసైడ్ అవుతాడు. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు చేయడమే కాదు తనకంటూ పేరు తెచ్చుకునే భిన్నమైన సబ్జెక్ట్ చేయాలని తంటాలు పడుతున్న సమయంలో రోడ్డు మీద ఒక పాడైన సినిమా రీల్ దొరుకుతుంది.
ఇప్పుడున్న డిజిటల్ ఏజ్ లో కూడా రీల్స్ వాడుతున్నారా అని డౌట్ వచ్చి ఆ రీల్ ని ల్యాబ్లో కడిగిస్తాడు. అప్పుడు ఆ రీల్ లో నటించిన అమ్మాయిని చూసి ఇంప్రెస్స్ అవుతాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి) అని తెలుసుకుంటాడు.
ఇంకా అప్పటినుండి ఆ అమ్మాయిని ఎలా అయినా తన సినిమాలో హీరోయిన్ గా ఒప్పించాలని ఆమె వెనక పడుతూ ఉంటాడు. ఇలా ఆమె వెంట పడుతున్న సమయంలో ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ రీల్ ఉన్నది అలేఖ్య కాదని అలేఖ్య సోదరి అని తెలుస్తుంది. హీరోయిన్ అవ్వాలని కోరికతో ఒక అప్ కమింగ్ దర్శకుడిని పెళ్లి చేసుకొని ఆ దర్శకుడు చేసే సినిమా ఆగిపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ సూసైడ్ చేసుకోవడంతో అలేఖ్య కుటుంబం అంతా సినిమా మీద అసహ్యం పెంచుకుంటారు.
ఇప్పుడు అలేఖ్య నవీన్ సినిమాలో నటించిందా ? అసలు ఈ కథకు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ ఎందుకు వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఓవరాల్ గా చెప్పాలంటే:
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ ఒక ఎమోషనల్ డ్రామా. స్టోరీ విషయం పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలిగే మంచి క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. అక్కడక్కడా కాస్త రొటీన్, డ్రాగ్ అనిపించినా టైటిల్ జస్టిఫికేషన్ బాగుంటుంది. ఒక్కసారి ఈ సినిమాను చూడొచ్చు.