ఇండస్ట్రీ టాక్ : “కాంతారా” ప్రీక్వెల్ కి లేటెస్ట్ మాసివ్ ప్లానింగ్..!

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన పలు చిత్రాల్లో అయితే కన్నడ సినిమా నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం “కాంతారా” కూడా ఒకటి. దర్శకుడు హీరోగా చేసిన రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ హిందీ తెలుగులో కూడా అఖండ విజయాన్ని సాధించింది.

దీనితో మేకర్స్ పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈసారి పార్ట్ 2 ఒక కొనసాగింపులా కాకుండా మునుపటి కథలా ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. మరి దీని నుంచి వచ్చిన నిన్నటి బిగ్గెస్ట్ అప్డేట్ అందరినీ ఒక్కసారిగా థ్రిల్ చేసింది. అయితే ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్టుగా వార్తలు కూడా వినిపించాయి.

మరి అందుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ టీజర్ మరియు గ్లింప్స్ చూసాక అందరికీ అర్ధం అయ్యింది. కాగా ఇపుడు మరో క్రేజీ టాక్ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సినిమా విషయంలో అయితే వినిపిస్తుంది. దీనితో ఈ సినిమాలో పాన్ ఇండియా వైడ్ గా అనేకమంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారట.

దాదాపు ఒక 15 మంది వరకు ఆయా పాత్రల్లో కాంతారా 2 లో అయితే కనిపించనున్నారు అని అంటున్నారు. దీని బట్టి సినిమాని మేకర్స్ ఎంత గ్రాండ్ గా తీసుకెళ్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కన్నడ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ కేజీఎఫ్, సలార్ చిత్రాలని తీస్తున్న హోంబలే ఫిల్మ్స్ వారే ఈ క్రేజీ ప్రీక్వెల్ ని నిర్మిస్తున్నారు.