అనసూయ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి – మీ కోసం అద్దిరిపోయే గుడ్ న్యూస్.

అనసూయ జబర్దస్త్ యాంకర్ గా బుల్లి తెరమీద సందడి చేస్తూ ప్రేక్షకుల్లో విపరితమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పలు టీ షోస్ లో హాట్ యాంకర్ గా ఆకట్టుకుంటూనే మరొక వైపు సినిమాలలో అధ్బుతమైన పాత్రల్లో నటిస్తూ మంచి క్రేజీ స్టార్ గా పాపులారిటీ ని తెచ్చుకుంది. ఇప్పటికే అనసూయ క్షణం, రంగస్థలం సినిమాలలో నటించి గొప్ప పేరు సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో కూడా కనిపించి కవ్విస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద కూడా అనసూయ అందాల ఆరబోతతో అదరగొడుతోంది.

అయితే అనసూయ ఎప్పుడో గాని ఒక ఐటెం సాంగ్ లో మెరిసి అభిమానుల హార్ట్ బీట్ పెంచేస్తుంది. ఇంతక ముందు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన విన్నర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి హంగామా చేసింది. ఆ తర్వాత ఎఫ్ 2 లో వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో కలిసి స్టెప్పులేసింది. ఇలా ఎప్పుడో ఒకసారి అనసూయ ఐటెం సాంగ్ చేసినా కూడా బాగానే క్రేజ్ సంపాదించుకుంటుంది. కాగా ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది అనసూయ. రంగస్థలమ సినిమాలో పోషించిన రంగమ్మత్త కంటే మంచి పేరు తీసుకు వస్తుందని చెప్పుకుంటున్నారు.

కాగా తాజాగా మరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందట. కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందని సమాచారం. ఇక అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్యూ బ్రదర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా లో అనసూయ పాత్ర కు మరోసారి మంచి పేరు దక్కించుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఇటీవలే విడుదలైన థ్యాంక్యూ బ్రదర్ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. అంతేకాదు మరికొన్ని సినిమాలని చేసేందుకు సైన్ చేసిందట.