“ఆచార్య” విషయంలో బయటకొచ్చిన అసలు నిజం.!

గడిచిన ఈ కొన్నేళ్లలో టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన పలు సెన్సేషనల్ బాక్సాఫీస్ హిట్స్ సహా కొన్ని ఎపిక్ డిజాస్టర్ లు కూడా ఉన్నాయి. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ని నిండా ముంచేసిన మొదటి సినిమాగా అయితే గత 2022 లో వచ్చిన చిత్రం “ఆచార్య” మొదటి వరుసలో ఉండగా ఈ సినిమా పెట్టిన తలనొప్పి అయితే అంతా ఇంతా కాదు.

రిలీజ్ తర్వాత కూడా మెగాస్టార్ ఎన్నోసార్లు చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే ఈ సినిమా భారీ ప్లాప్ విషయంలో చాలా మంది ప్రధాన నిందితునిగా మెగాస్టార్ నే వేలెత్తి చూపించారు. కానీ ఈ సినిమా నష్టాల విషయంలో చిరు చేసింది మాత్రం ఎవరూ చెప్పలేదు.

కానీ ఇప్పుడు అసలు నిజం బయటకి వచ్చింది. గత ఏడాదిలోనే ఆచార్య తర్వాత అంతకు మించిన నష్టాలు మిగిల్చిన చిత్రంగా “లైగర్” నిలిచింది. దీనితో దర్శకుడు పూరి జగన్నాథ్ మాకు న్యాయం చెయ్యాలని నైజాం డిస్ట్రిబ్యూటర్ లు రోడ్డెక్కారు. అయితే వీరే స్వయంగా ఆచార్య సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు..

ఏకంగా 13 కోట్లు వెనక్కి ఇచ్చి తమకి సెటిల్ చేసారని కానీ వీరు మాత్రం ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ లో ఉన్నాం అదీ ఇది అంటున్నారని వారి డబ్బులు మా దగ్గర కానీ ఉంటే చొక్కా పట్టుకొని అడిగి మరీ తీసుకుంటారని కానీ ఇప్పుడు మా డబ్బులు వాళ్ళ దగ్గర ఉండిపోయాయి వారు కూడా అదే రీతిలో ఇవ్వాలి కదా అని డిమాండ్ చేస్తున్నారు.