“RRR” లో రామ్ చరణ్ పై డిలీట్ చేసిన ఇంట్రెస్టింగ్ సీన్ చూసారా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర భారీ స్థాయి హిట్ అయినటువంటి లేటెస్ట్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్(RRR). ఒక్క తెలుగులోనే కాకుండా ఇప్పుడు అయితే వరల్డ్ వైడ్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

మరి ఈ సినిమా దాదాపు 3 గంటలకి పైన ఉన్నా కూడా మనల్ని రాజమౌళి మెప్పించడం ఒకెత్తు అయితే ఫారినర్స్ ని కూడా కట్టి పడేలా చేయడం ఇంకో ఎత్తు. అయితే ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలని రాజమౌళి అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు. అయితే ఎవరికీ ఎక్కువ తక్కువ అని పక్కన పెడితే ఇద్దరిపై కూడా పలు సీన్స్ ని రాజమౌళి డిలీట్ చేసారని తెలిసిందే.

ముందు అయితే ఎన్టీఆర్ పై సీన్స్ రాజమౌళి తీసేశారని తెలిసింది కానీ ఇప్పుడు రామ్ చరణ్ పై కూడా ఒక అదిరే చిన్నపాటి సీన్ ని తీసినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ చేసిన అల్లూరి పుట్టకపై ఈ సీన్ కనిపిస్తుందట.

రామరాజు పుట్టిన తర్వాత మహా రుషిల దగ్గర మహా యాగం సమయంలో తల్లి ఋషికి బిడ్డని అప్పగిస్తున్నట్టుగా ఈ ఉంటుందట. దీని తాలూకా కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి అధికారికంగా బయటకి వచ్చింది. ఇది చూసి అభిమానులు అయితే మరింత స్థాయిలో ఎగ్జైట్ అవుతున్నారు. మరి అదైతే మీరు కూడా చూసెయ్యండి.