ఈ బాల మేధావి పనికి కరోనా కూడా నవ్వుకుంటుందేమో ?

A cute little boy eating lollypop with face mask

కరోనా దెబ్బకి ముఖానికి మాస్కు ధరించకుండా ఇంట్లో నుండి బయటకి వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. ముఖానికి మాస్క్ అనివార్యం అయ్యింది. చిన్న పెద్దా తేడా లేకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు వేసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే ఈ మాస్కులు ధరించిన సమయంలో ఏమైనా తినాలన్న లేదా తాగాలన్న భయపడుతూ మాస్క్ తీసి తినేసి తాగేసి మరల వెంటనే మాస్క్ పెట్టేసుకోవటం ఇబ్బందిగానే ఉన్నా తప్పట్లేదు. అయితే ఇది కష్టంగా భావిస్తున్న కొంతమంది కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.

విన్నూతనంగా పెద్ద వారు ఏదైనా చేస్తే తెలివిగల వారు అనుకుంటాం కానీ ఈ చిన్న పిల్లవాడు చేసిన పనికి యేమని మెచ్చుకోవాలి , ఇది చుసిన వారందరూ పగలబడి నవ్వుకుంటున్నారట. ఈ పిల్లవాడు ముఖానికి సర్జికల్‌ మాస్కు ధరించే మందే తనకు నచ్చిన లాలిపాప్‌ను మాస్కు బయటి నుంచి గుచ్చి నోట్లో పెట్టుకున్నాడు. దీంతో ఇటు మాస్కు పెట్టుకొని, అటు ఎంచక్కా తన చాక్లెట్‌ను తింటూ ఎంజాయ్‌ చేశాడు. సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతుంది. చూసిన నెటిజన్లు బుడ్డోడి ఐడియా భలే ఉందని ప్రశంసిస్తున్నారు. ఇంత చిన్న పిల్లవాడినకి అంత పెద్ద ఆలోచన ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. మేము కూడా ఇక మీదట ఇలా ప్రయత్నిస్తామని సరదా కామెంట్లు చేస్తున్నారు.