రామ్ చరణ్ తో క్రేజీ యూనివర్స్ క్రియేట్ చెయ్యట్లేదు కదా?

ఇపుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు కేవలం 15 సినిమాలు మాత్రమే చేసినా ఇంటర్నేషనల్ వైడ్ గా చరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందుకు ట్రిపుల్ ఆర్(RRR) సినిమాకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది.

అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సినిమాలు అన్ని భాషల నుంచి కూడా ఓ రేంజ్ లో ట్రీట్ ఇచ్చేవి వస్తున్నాయి. అసలు మూవీ లవర్స్ కావాల్సిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఒకో దర్శకుడు నిర్మాణ సంస్థలు కూడా ఒకో సాలిడ్ యూనివర్స్ ని క్రియేట్ చేసి ఒకో సినిమాతో ఇంకో సినిమా లింక్ అలాగే ఒక హీరో తో ఇంకో హీరోకి కూడా కనెక్షన్ ఉంటుంది.

ఇవి వినడానికి గాని చూడడానికి గాని ఎంత కేజ్రీగా ఉంటాయో గత ఏడాది “విక్రమ్” తో అయితే చూసాం. కాగా ఇపుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఎమన్నా ప్లాన్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. లేటెస్ట్ గా అయితే తాను డైరెక్ట్ చేసిన సినిమా “ఏజెంట్” తో వస్తున్నారు.

ఐతే దీని కోసం రామ్ చరణ్ ని “ధృవ” గా మర్చి ఏజెంట్ గా అఖిల్ ఆఫీసర్ ధృవ తో మాట్లాడుతున్నట్టుగా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రిలీజ్ చేశారు. దీనితో ఈ క్రాసోవర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే ఈ లింక్ తో కొత్త సినిమా డెవలప్ చేసి ఇద్దరినీ ఓ సినిమాలో పెట్టినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. కాకపోతే దృవ సినిమా ఒరిజినల్ తమిళ్ లో ఉంది కాబట్టి ఇలాంటి మార్పులు ఎంతవరకు సాధ్యం అవుతాయో చూడాలి.