ఇళయదళపతి విజయ్ కి కోలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో పవర్ స్టార్ కి ఏ స్థాయిలో అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తమిళనాట విజయ్ కి కూడా అలాగే ఉంది. ఎంత పెద్ద స్టార్ అయిన చాలా సింపుల్ గా ఉండటం దళపతి స్టైల్. అదే అందరికి అతనిని కనెక్ట్ చేసింది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా విజయ్ చేస్తూ ఉంటారు.
రీసెంట్ గా పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ ని ఆయన బహుమతులు ఇచ్చారు. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇక విజయ్ బర్త్ డే సందర్భంగా లియో చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అలాగే రెండు పోస్టర్స్ ని కూడా వదిలారు. అయితే ఈ సాంగ్ లో విజయ్ సిగరెట్ కాల్చుతున్నట్లు విజువల్స్ చూపించడంపై ఓ సామాజిక కార్యకర్త నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ క్రింద ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. లియో సాంగ్ లో విజయ్ సిగరెట్ తాగుతున్నట్లు చూపించడం అంతే మాదకద్రవ్యాల వాడకాన్ని ప్రోత్సహించడమే.
అలాగే సినిమాలో రౌడీయిజం ఎక్కువగా ఎలివేట్ చేస్తూ చూపించారు. వీటి ద్వారా యువత తప్పుడు మార్గంవైపు వెళ్ళే అవకాశం ఉందని సదరు సామాజిక కార్యకర్త ఆన్ లైన్ లో కంప్లైంట్ చేశారు. దీనిని నార్కోటిక్ కంట్రోల్ బోర్డు కూడా యాక్సప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశపై లోకేష్ కనగరాజ్ ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఖైది, విక్రమ్ మూవీస్ చేసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు లియో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వీటి తర్వాత యూనివర్స్ లోకి డార్లింగ్ ప్రభాస్ ని కూడా తీసుకొని రాబోతున్నాడు. వీరందరితో మరల ఒక సూపర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాలని లోకేష్ ప్లాన్ గా తెలుస్తోంది.