సర్జరీ చేయించుకున్న బుట్ట బొమ్మ… అసలు విషయం చెప్పిన హీరోయిన్ టీమ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈమెకు వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడిన వరుసగా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పూజా హెగ్డే గురించి ఓ వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.చూడటానికి కుందనపు బొమ్మలా ఉన్నటువంటి పూజా హెగ్డే సర్జరీ చేయించుకుంటుంది అనే వార్త నెట్టింట వైరల్ అయింది.

చాలామంది ఆమె స్నేహితులు బంధుమిత్రులు పూజా హెగ్డే ముక్కు సరిగా లేదని ఆమెకు సలహా ఇవ్వడంతో ముక్కు సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పూజా హెగ్డే సర్జరీ వార్తలు గురించి తన టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు.పూజా హెగ్డే గత కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో ఆమె సర్జరీకి సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు.

పూజా హెగ్డే గత కొద్ది రోజులుగా హాలిడే వెకేషన్ కి వెళ్ళారని అంతకుమించి తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తన సర్జరీ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. ఇక ఈమె ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగుతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ జనగణమన సినిమాలో కూడా ఒక షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగుకు మేకర్స్ కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇలా వరుస సినిమాలతో పూజా హెగ్డే ఎంతో బిజీగా ఉన్నారు.