టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్‌లో ‘మధురం’ అనే షార్ట్ ఫిల్మ్ తీసి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ లఘు చిత్రం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోవడమే కాకుండా పలు అవార్డులు అందుకుంది. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ నటి చాందిని చౌదరి ఫేమస్ అయ్యింది. అయితే ఈ సినిమా అనంతరం ఫణీంద్రా బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్‌తో మను అనే చిత్రం తెరకెక్కించారు. క్రౌడ్ ఫండిరగ్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమా అనంతరం దాదాపు 6 సంవత్సరాల తర్వాత మరో కొత్త సినిమాతో ముందుకు రాబోతున్నాడు ఫణీ. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విూరు తనని రేపు చూస్తారు అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం? అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం. 8 వసంతాలు అంటే ‘8 స్ప్రింగ్స్’ ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ప్లోర్ చేయనుంది.