కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ’దేవి’. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. నటి ప్రేమ ప్రధానపాత్రలో నటించిన ఈ మూవీ గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వస్తున్న రోజుల్లో తీసిన చిత్రం ‘దేవి’.
మంచి విజయాన్ని సాధించింది. ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం కోడి రామకృష్ణ గారే. సన్నివేశం బాగా వచ్చే వరకూ 50టేక్‌లు అయినా తీస్తారు. రాత్రిపగలూ పని చేశాం. డైలాగులు బాగా ప్రాక్టీస్ చేయించేవారు. దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడమని చెప్పేవారు. ఆ గెటప్ వేశాక హావభావాలు వాటంతట అవే వచ్చేస్తాయి. ఇలాంటి పాముల సినిమాలు ఎవరు చూస్తార’ని అనుకున్నాం.
చిత్రీకరణ మొత్తం అయ్యాక చూసి నేనే ఆశ్చర్యపోయాను. షూటింగ్ సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఆ బాధతో మేం రెండు రోజులు షూటింగ్ ఆపేశాం. కైమాక్స్ తీసేటప్పుడు కూడా మంచులో చాలా ఇబ్బందులు పడ్డాం’ అని చెప్పారు.
తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘ఎయిర్‌హోస్టెస్ కావాలనేది నా కల. అయితే, మా అమ్మకు నన్ను ఓ నటిగా చూడాలని ఉండేది. ఆ విషయంలో మా ఇద్దరికీ గొడవ అవుతుండేది. ఆమె కలను ఎందుకు నెరవేర్చకూడదనిపించి మొదటిసారి ‘సవ్యసాచి’ అనే కన్నడ సినిమాలో నటించా. నటిగా తొలి ప్రయత్నంలోనే పరాజయం అందుకున్నా. అయినా ‘ఓం’లో అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్. నాకు వరుస అవకాశాలు వచ్చాయి.
‘ధర్మచక్రం’తో తెలుగులోకి ప్రవేశించా. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘క్షణ క్షణం’ లాంటి సినిమాలు చేయలేకపోయాననే బాధ ఉంది. కెమెరా ముందు కనిపించడం కోసం ఏదో ఒక పాత్రను పోషించడం నాకు ఇష్టం లేదు. వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉందని ప్రేమ వెల్లడిరచారు.