బాలయ్య – కోడి రామకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ప్రతి ఒక్కరిలోనూ ఉండిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ అఖండ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ , బోయపాటి శీను క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండేదో, గతంలో బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ అలాగే ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల మామయ్య, మంగమ్మగారి మనవడు, మువ్వగోపాలుడు, ముద్దుల కృష్ణయ్య వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలన్ని భార్గ‌వ్ ఆర్ట్స్ అధినేత యస్‌. గోపాల్‌రెడ్డి నిర్మాత‌గా వ్యవహరించారు.

ఈ విధంగా ఈ ముగ్గురి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. అలాగే వీరి కాంబినేషన్లో ఒక జానపద చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ సినిమా గురించి ప్రకటన వెలువడగానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోందని ప్రతి ఒక్కరు భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మధ్యవర్తుల కారణంగా ఆగిపోయిందని గతంలో కోడి రామకృష్ణ వెల్లడించారు.

గోపాల్ రెడ్డి భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్లో బాలకృష్ణ నటించిన ప్రతి సినిమాకి పారితోషికం పెంచుకుంటూ పోయారు. అయితే గోపాల్ రెడ్డి నిర్మాణంలో తదుపరి బాలకృష్ణ నటించిన సినిమా కోసం బాలకృష్ణ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సి అవసరం లేదని భావించిన గోపాల్ రెడ్డి ఆయనకు పారితోషికం ఇచ్చే స్థాయిలో మనం ఉన్నప్పుడు తనతో తప్పనిసరిగా సినిమా చేద్దామని భావించారు. అందుకే మళ్ళీ మా కాంబినేషన్లో సినిమాలు రాలేదని కోడి రామకృష్ణ వెల్లడించారు. ఏదిఏమైనా ఈ ముగ్గురి కాంబినేషన్లో సూపర్ హిట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి ఇకపోతే ప్రస్తుతం డైరెక్టర్ కోడి రామకృష్ణ నిర్మాత గోపాల్ రెడ్డి ఇద్దరు కూడా మన మధ్య లేరు.