‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ చిత్రం నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదల

కోడి రామకృష్ణ గారి సమర్పణలో కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా, సంజన ఆనంద్ హీరోయిన్ గా శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తాజా సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.. మాస్ బీట్ తో సాగే “నచ్చావ్ అబ్బాయి ” పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది.ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు

నచ్చావ్ అబ్బా..య్ నచ్చావ్ అబ్బా..య్ పిచ్చి పిచ్చిగా.. నచ్చావ్ అబ్బాయ్
పోనీలే అమ్మాయ్ ఇన్నాళ్లకీ..మంచి మంచి మాట చెప్పావమ్మా..య్
ఏం చేస్తాం నువ్వు చెపితే విందామని చూస్తూ చూస్తూ వున్నాలే..
నీవల్ల అది జరిగే పనీ కాదని నేనే.. బయట.. పడ్డానే..
తస్సాదియ్యా తస్సా..దియ్యా పారి పోయిందే చూడే గుండె లయ
తస్సాదియ్యా తస్సా..దియ్యా ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ్య

భాస్కరపట్ల ఈ పాటకు అందించిన లిరిక్స్ అందరూ పాడుకొనేలా చాలా క్యాచీగా ఉన్నాయి.రాజ్ కె. నల్లి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది …బాను మాస్టర్ కోరియోగ్రపీ లో కిరణ్ డాన్స్ చాలా చూడముచ్చటగా ఉంది.

సాంగ్ రిలీజ్ అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..

చిత్ర హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “SR కళ్యాణ మండపం” సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ నచ్చిందని ఈ సినిమాకు పెట్టడం జరిగింది.

కథ కు తగ్గట్టే ఈ టైటిల్ పెట్టాము.ఈ సినిమాలో చాలా ట్విస్ట్, టర్న్స్ ఉంటాయి.. మేము విడుదల చేసిన రెండు సాంగ్స్ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. కోడి రామకృష్ణ గారి వంటి పెద్ద బ్యానర్ లో చెయ్యడం చాలా సంతోషంగా వుంది.దీప్తి గారు నన్ను తమ్ముడిలా చాలా బాగా చూసుకున్నారు. నరేష్ , భరత్ గార్లు నిర్మాతలుగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్స్ లా పరిగెత్తి వర్క్ చేయించేవారు.ఈ సినిమాకు 24 క్రాఫ్ట్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు.”SR కళ్యాణ మండపం” సినిమాను అందరూ చాలా బాగా ఆదరించారు ఆ సినిమా తర్వాత శ్రీధర్ తో మా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా వుంది. హీరోయిన్ సంజన రోల్ అందరికీ బాగా నచ్చుతుంది. నా చిన్నప్పుడు మణిశర్మ గారి పాటలకు డాన్స్ వేసే వాడిని. అలంటిది ఇప్పుడు అయన మ్యూజిక్ లో డాన్స్ చేయడం చాలా సంతోషంగా వుంది. ఇందులోని 6 పాటలు బాగుంటాయి.భాస్కర పట్ల గారు నా సినిమాకు ప్రత్యేక శ్రద్ద పెట్టి రాస్తాడు. చుక్కలు చున్నీ నుండి మా కాబినేషన్ మొదలయ్యింది. బాను మాస్టర్ నాతో బాగా డాన్స్ చేయించాడు. ఈ సినిమా 100% అవుట్ అవుట్ మాస్ కామెడీ ఉంటుంది. మేము చూయించిన టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ టీజర్ కింటే డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. సెప్టెంబర్ 9 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె మాట్లాడుతూ..”SR కళ్యాణ మండపం” సినిమా కంటే ముందే కోడి దివ్య గారి బ్యానర్ లో చేద్దాం అనుకున్నాము.

అప్పుడు కుదరలేదు అందుకే ఇప్పుడు చేస్తున్నాము. ఇందులో”SR కళ్యాణ మండపం” స్టూడెంట్ లా , ఫాదర్ సన్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ,కామెడీ ఎంటర్ టైన్మెంట్ సీన్స్ ఎలా చూశారో దానికంటే డబుల్ ఈ సినిమాలో ఉంటుంది ఇందులో ఫస్ట్ అఫ్ అంత ఫాస్ ఎంటర్ టైనర్ గా ఉంటే సెకండాఫ్ అంతా ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది… చిరంజీవి గారి “గ్యాంగ్ లీడర్” తరహాలో ప్లాన్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది.

ఇందులో బాబా మాస్టర్, కిరణ్ భయ్యా ల కాంబినేషన్ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను . మణిశర్మ గారు అందించిన మ్యూజిక్ మా సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.ఇందులోని పాటలు చాలా బాగా వచ్చాయి. ఇంతకుముందు మేము విడుదల చేసిన ‘లాయర్ పాప’ పాట పెద్ద హిట్ అయ్యింది.”SR కళ్యాణ మండపం”లోని మేనరిజంతో చెప్పే డైలాగ్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టడం జరిగింది.కోడి రామకృష్ణ గారి వంటి పెద్ద బ్యానర్ లో వర్క్ చేస్తున్నందున కోడిరామక్రి ష్ణ గారి దగ్గర పని చేసిన దర్శకులను కలసి వారి దగ్గరనుండి కొంత ఇన్పుట్ తీసుకొని ఈ సినిమా చెయ్యడం జరిగింది. , ఇందులో హీరో, హీరోయిన్ లు కిరణ్, సంజన లు చాలా ఎనర్జీటిక్ గా డ్యాన్స్ చేశారు.సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి అన్నారు.

చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి మాట్లాడుతూ..ప్రేక్షకులు, మీడియా వారు ఇంతవరకు మా నాన్న కు సపోర్ట్ చేశారు . అలాగే ఇప్పుడు మేము చేస్తున్న ఈ సినిమాకు కూడా అదేవిధమైన సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్స్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. రాజ్ కె. నల్లి ఈ సినిమాకు మంచి విజువల్స్ ఇచ్చాడు.కిరణ్, శ్రీధర్ లది మంచి కాంబినేషన్ ఈ సినిమాకు మంచి ఎసెట్ అయ్యారు. అలాగే మణి శర్మ మ్యూజిక్, బాబా భాస్కర్, యస్. వి. కృష్ణారెడ్డి లు ఇలా ఈ సినిమాకు మాకు మంచి టీం దొరికడమే కాకుండా అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు.నాకు డైరెక్టర్ గా చేయడం ఇంట్రెస్ట్ ఉన్నా ప్రొడక్షన్ వైపు రావడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 9 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భ‌ర‌త్ రొంగలి మాట్లాడుతూ..మా ప్రతి సినిమాను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదములు. కోడి దివ్య బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా మొదటిది. కిరణ్ తోఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా నాకిది నాలుగవ సినిమా, ఆర్టిస్ట్ గా రెండవ సినిమా..”SR కళ్యాణ మండపం” తర్వాత హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరోయిన్ సంజన ఆనంద్ మాట్లాడుతూ.. నాకు ఇది తెలుగులో మొదటి సినిమా. ఇందులో నాది ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తున్నాను. ఇందులోని పాటలు అందరికీ నచ్చుతాయి. నాకిలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

సినిమాటోగ్రఫర్ రాజ్ కే. నల్లి మాట్లాడుతూ..ప్రాపర్ కమర్సియల్ కంటెంట్ కు ఏం కావాలో అన్నీ ఇందులో ఉంటాయి.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. దీప్తి గారు, నరేష్, గారు, భరత్ గారు, కిరణ్ ఇలా అందరూ కష్టపడడంతో మంచి పవర్ ప్యాకేజి లా ఈ సినిమా వచ్చింది. ఇందులోని పాటలు అందరికీ కచ్చితంగా నచ్చుతాయి అన్నారు.

న‌టీన‌టులు –
కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు
టెక్నికల్ టీమ్:
స‌మ‌ర్ప‌ణ‌.. కోడి రామ‌కృష్ణ‌
బ్యాన‌ర్‌.. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
లిరిక్స్‌.. భాస్క‌ర్ భ‌ట్ల
ఎడిట‌ర్‌.. ప్ర‌వీన్ పూడి
ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ .. భ‌ర‌త్ రొంగలి
పిఆర్ ఓ.. ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌
సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ నల్లి
సంగీతం.. మ‌ణిశ‌ర్మ‌
కో-ప్రోడ్యూస‌ర్‌.. న‌రేష్ రెడ్ది మూలే
ప్రోడ్యూస‌ర్‌.. కోడి దివ్య దీప్తి
డైర‌క్ట‌ర్‌.. శ్రీధర్ గాదె (SR కళ్యాణమండపం ఫేమ్)