గాసిప్స్ : ఈ సినిమాకి కేవలం 20 రోజులు ఇచ్చిన పవన్ కళ్యాణ్.?

Pawan Kalyan Film

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తన లైనప్ లో వేసుకున్నాడు. అయితే వాటిలో ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమా మాత్రం భారీ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు”. దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా భారీ పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతుంది.

ఈ సినిమా సగానికి మేర పూర్తి కాగా దీని తర్వాత మరో స్ట్రైట్ సినిమా అలాగే ఇంకో రీమేక్ సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఆ రీమేక్ సినిమాపై టాక్ విస్తృతంగా వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 అంటే 20 రోజులు మాత్రమే నిర్మాతలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

తమిళ్ లో మంచి హిట్ అయ్యిన వినోదయం సితం కి రీమేక్ గా చేసే ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తుండగా పవన్ కూడా మళ్ళీ గోపాల గోపాల తరహాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని దర్శకుడిగా సముద్రఖని తెలుగులో తీయనున్నారు.

మరి ఈ సినిమా కోసం 20 రోజులు కేటాయించిన పవన్ కేవలం ఈ అక్టోబర్ లోపు సినిమా కంప్లీట్ చేసేయనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. అలాగే రానున్న రోజుల్లో మరింత సమాచారం ఈ సినిమాపై రానుంది.