జీవితంలో ఆ హీరో కొడుకుతో సినిమా చేయనని తెగేసి చెప్పిన రాజమౌళి.. ఆ హీరో ఎవరు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కేరాఫ్ అడ్రస్ అయినటువంటి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కెరియర్ మొదట్లో సీరియల్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈయన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఈ సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఇప్పటివరకు ఎక్కడ వెనుతిరిగి చూసుకోలేదు ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.ఇకపోతే బాహుబలి త్రిబుల్ ఆర్ వంటి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే రాజమౌళి వంటి దర్శకుడితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఆయనతో నటించే అవకాశం రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఈయన దర్శకత్వంలో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయి హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్ హీరో తన కొడుకుతో రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయించాలని భావించారట ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని రాజమౌళి దగ్గర ప్రస్తావించడంతో రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజమౌళి వద్దకు వెళ్లి తన కొడుకుతో ఒక సినిమా చేసి తనకు మంచి హిట్ పడేలా చూడమని తద్వారా తన కొడుకు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని చెప్పారట.ఇలా రాజమౌళి తన కొడుకుతో సినిమా చేయడం కోసం ఆ హీరో భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ రాజమౌళి మాత్రం తను ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని అయినా తన కొడుకుతో తాను ఎప్పటికీ సినిమా చేయనని చెప్పారట. తాను డైరెక్ట్ చేసే బాడీ ఆ హీరో కొడుకుది కాదని మొహం మీద ఆ హీరోతో రాజమౌళి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రాజమౌళికి అలాంటి ఆఫర్ ఇచ్చిన ఆ సీనియర్ హీరో ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.