ఈ ఏడాది ఇండస్ట్రీకి హిట్ ఇద్దామని ప్రయత్నించ.. కుదరలేదు: విజయ్ దేవరకొండ

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

ఇకపోతే 2022 సైమా అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియా అవార్డు సొంతం చేసుకున్నాడు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయితే తాజాగా ఈ వీడియోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ వీడియోలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఈ సైమా అవార్డులలో భాగంగా అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. గొప్ప సినిమాలు అద్భుతమైన నటనతో ఈ ఏడాది హిట్ ఇచ్చి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఈ ఏడాది ఇండస్ట్రీకి మంచి హిట్ ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను అయితే కుదరలేదు. మనకు మంచి చెడు రెండు రోజులు వస్తుంటాయి రోజులు ఎలాంటివైనా మనంచేయాల్సిన పనులను కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.