అశోకవనంలో అర్జున కళ్యాణం ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన ఆహా!

విశ్వక్ సేన్,రుక్సార్‌ జంటగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా మే ఆరో తేదీ థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇక థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఇదే నెలలోనే ఆహాలో ప్రసారమవుతుందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ గురించి ఆహా అధికారిక ప్రకటన చేసింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ తో పాటు సినిమా విడుదల తేదీని అధికారక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా జూన్ 3వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం కానుంది.గ్రామీణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెళ్లి అనే కాన్సెప్ట్‌ చూట్టూ తిరుగుతుంది.ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీగా సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్‌ షో నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆహా ఫాన్సీ ధరకే దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేయడమే కాకుండా అల్లం అర్జున్ కుమార్ పెళ్లికూతురును వెతుక్కుంటూ ఆహాకి వచ్చేస్తున్నాడు. పెళ్లి డేట్ ఫిక్స్ పెళ్లి కూతురు ఎవరో మరి అంటూ ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల కానున్నట్లు ఆహా అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.