సాధారణంగా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే తప్పనిసరిగా లైంగిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడే భార్యాభర్తల వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే లైంగిక జీవితం సంతోషంగా ఉండదో వారి వైవాహిక జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడుతుంటాయి. అయితే లైంగిక జీవితం సంతోషంగా లేకపోవడానికి కారణాలు ఇవే కావచ్చు. మరి ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం..
భార్య భర్తల మధ్య అంగస్తంభన సమస్య అనేది ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణ లైంగిక సమస్య. అంగస్తంభన ఎప్పుడూ కూడా ఒక మనిషి తీవ్రమైన ఒత్తిడి ఆందోళనలను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి సమస్య ఏర్పడుతుంది దీనికి ఒత్తిడి తగ్గించుకోవడమే పరిష్కారం. సెక్స్ డ్రైవ్ తగ్గడం వల్ల వారి లైంగిక పునరావృతం ప్రభావితమైంది లేదా వారు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం పూర్తిగా మానేయడం లేదా ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొన్న సమయంలో తీవ్రమైన నొప్పి కలగడం వంటి సమస్యల వల్ల లైంగిక జీవితం సంతోషంగా ఉండదు.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అకాల స్ఖలనం మీ లైంగిక జీవితంలో , బహుశా మీ సంబంధానికి కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. మీ భాగస్వామిని సంతృప్తి పరచలేకపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే ఎమోషనల్ కనెక్షన్ ఉండదు అలాంటి సమయంలో కూడా లైంగిక ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా భార్య భర్తల మధ్య లైంగిక జీవితం సంతోషంగా లేకపోవడానికి ఇదే కారణం కావచ్చు.