మీ లైంగిక జీవితం బాగుండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

ఈ రోజుల్లో పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకునే జంటల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్త విడిపోవడానికి ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పుకుంటారు.కారణాలు ఏవైనా మీ వైవాహిక జీవితం బాగుండాలంటే మీ ఆలోచనలను, ధోరణి మార్చుకొని మీ భాగస్వామి పట్ల నమ్మకం గౌరవాన్ని పొందాలి. లేకపోతే మీరు కూడా విడాకులు తీసుకునే జంటల సంఖ్యలో చేరిపోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితం బాగుండాలంటే దంపతులిద్దరూ ఈ కింది సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

మీ వైవాహిక జీవితంలో భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాగిపోయే వైవాహిక జీవితం ఎక్కువకాలం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. అలాకాకుండా ఒకరినీ గురించి మరొకరు పట్టించుకోకుండా ఎవరికి తోచింది వారు చేసుకుంటూ వెళ్తే అనేక సమస్యలు తలెత్తి సంతోషకరమైన వైవాహిక జీవితంలో బాధలు కష్టాలు కన్నీళ్లు మిగులుతాయి.

సహజంగా దంపతులిద్దరూ వైవాహిక జీవితంలో ఎక్కువ సమయం ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. కానీ ఈ రోజుల్లో సంసార సాగరాన్ని ఈదడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఆయన మీ పర్సనల్ లైఫ్ కంటూ ఒక టైం కేటాయించుకోవడం మంచిది అప్పుడే మీ దాంపత్య జీవనం సాఫీగా సాగిపోతుంది.

దాంపత్య జీవనంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించుకున్నప్పుడు బంధం మరింత బలపడుతుంది. అలాకాకుండా మీ భాగస్వామి పట్ల చిరాకు,కోపం,అసహ్యం వంటి లక్షణాలను ప్రదర్శిస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు తప్పవు.

దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం తో పాటు లైంగిక ఆనంద కూడా చాలా అవసరం.లైంగిక ఆనందాన్ని పొందలేని జంటల బంధం ఎక్కువ రోజులు నిలబడలేదని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ఆఫీసులో మీరు బాస్ అయినా ఇంట్లో మాత్రం మీరు ఒక భార్య, లేదా భర్త అని గుర్తంచుకోండి. ఇంట్లో మీరు చేయాల్సినవి అలాగే చేయాలి. దాపరికాలు లేకుండా ఓపెన్ గా ఉండాలి. మీ పట్ల మీ భాగస్వామి ఎలాంటి అభద్రతాభావం పెంచుకోకుండా చూడాలి. మీపై విపరీతమైన నమ్మకాన్ని పెంపొందించుకోవాలి.