ఆడవాళ్లు ఆరోగ్యం విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందితే కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయి. ఆడవాళ్లలో ఎక్కువమంది పోషకాల లోపంతో బాధ పడుతూ ఉంటారు. స్త్రీలు రోజులో ఎక్కువ సమయం పని చేయడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటయని కచ్చితంగా చెప్పవచ్చు.
ఆకుకూరలి, తృణ ధాన్యాలు, చిక్కుళ్లను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. ఆడవాళ్లు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఆడవాళ్లు బరువును కంట్రోల్ లో ఉంచుకుంటే కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆడవాళ్లు శారీరకంగా బలంగా ఉన్నా లసరి సరిగా రాకపోవడం, నెలసరిలో నొప్పి, అధిక రక్తస్రావం, పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు, శారీరక బలహీనత, నీరసం, అలసట, ఊబకాయం, థైరాయిడ్, మెనోపాజ్ లాంటి సమస్యలు వాళ్లను వేధిస్తాయి.
కొబ్బరి శరీర బలాన్ని పెంచడంలో, ఎముకలు ఆరోగ్యంగా ఉంచడంలో, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ప్రతి మహిళ ఉదయాన్ని నల్ల ఎండుద్రాక్షతో ప్రారంభిస్తే బోలెడు రోగాలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ను ప్రోత్సహించి రక్తహీనతను తగ్గించడంలో నల్ల ఎండు ద్రాక్ష సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ నుండి కండరాలు, ఎముకల ఆరోగ్యం వరకు అన్ని సమస్యలను నువ్వులు పరిష్కరిస్తాయి.
మహిళలలో బలహీనతను తరిమికొట్టడంలో ఖర్జూరం తోడ్పడుతుంది. ఉసిరికి ఆయుర్వేదంలో గొప్ప స్థానం ఉండగా ఉసిరి పొడి, ఉసిరి జ్యూస్, ఉసిరి క్యాండీ, పచ్చి ఉసిరి. ఇలా చాలా విధాలుగా ఉసిరిని తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఉసిరి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణాశయ సమస్యలను, మలబద్దకాన్ని పరిష్కరిస్తుందని చెప్పవచ్చు.