రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతెరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పాల్గొన్నారు. ఈ కొత్త స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టడం గమనార్హం. అహ్మదాబాద్‌లోని ఈ స్టేడియాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే.
లక్షా పది వేల సామర్థ్యంతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు సృష్టించింది. కాసేపట్లోనే ఈ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య డేనైట్ ప్రారంభం కాబోతోంది. అసలే భారీ స్టేడియం.. పైగా డేనైట్‌లో, గులాబి బంతితో మ్యాచ్ జరగబోతుండటం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున 1982లో దీనిని నిర్మించారు. అక్టోబరు 2015లో దీనిని పునరుద్ధరించాలని, సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ షేర్ చేస్తోంది. పునరుద్ధరణకు ముందు ఈ స్టేడియం సామర్థ్యం 49 వేలు మాత్రమే. ఇప్పుడు దీని సామర్థ్యం రెండింతలకు పెరిగింది. చారిత్రక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియం సామర్థ్యం 90 వేలే కాగా, ఇప్పుడు దీనిని మొతేరా స్టేడియం అధిగమించింది. మొతేరా స్టేడియంలో లక్షా పది వేల మంది కూర్చొని హాయిగా మ్యాచ్ చూడొచ్చు..!
Gujarat: President Ram Nath Kovind and his wife perform 'bhumi pujan' of Sardar Vallabhbhai Patel Sports Enclave in Ahmedabad's Motera
Union Home Minister Amit Shah, Sports Minister Kiren Rijiju and Gujarat Deputy Chief Minister Nitin Patel also present pic.twitter.com/vWlEnoTPQ1
— ANI (@ANI) February 24, 2021