దేశంలో చాలామందికి ఉన్నత చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల చదువు విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. పీహెచ్డీ, ఎంఫిల్ చదివే వాళ్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. అయితే ఉన్నత చదువులు చదవాలని భావించే వాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫెలోషిప్ ను అందిస్తోంది. ఆర్థికం వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకోవడానికి ఈ స్కాలర్ షిప్ ఉపయోగపడుతుంది.
ఈ ఫెలోషిప్ కు ఎంపికైన వాళ్లకు 42,000 రూపాయల ఫెలోషిప్ లభించనుంది. పీహెచ్డీలు చేస్తున్న ఓబీసీ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగి ఉంటారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోలు 37 వేల రూపాయల స్కాలర్ షిప్ పొందే ఛాన్స్ ఉండగా సీనియర్ రీసెర్చ్ ఫెలోలు రూ.42,000 స్కాలర్ షిప్ పొందే అవకాశం అయితే ఉంటుంది. వెయ్యి ఓబీసీ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.6 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. https://socialjustice.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల అర్హతల ఆధారంగా స్కాలర్ షిప్ లో మార్పులు చోటు చేసుకుంటాయి. స్కాలర్ షిప్ పొందాలని భావించే వాళ్లకు ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
https://socialjustice.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులకు సులభంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.