మీ దగ్గర పాత రూ.2 వేల నోటు ఉందా.. ఆ నోట్లను సులువుగా ఏ విధంగా మార్చుకోవాలంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది రూ.2000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ.2,000 నోట్లను రద్దు చేయడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వాళ్లకు ఇప్పటికీ 2000 రూపాయల నోట్లను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. తపాలా శాఖ ద్వారా ఇన్సూర్డ్‌ పోస్ట్‌ లేదా టీఎల్‌ఆర్‌ కవర్ సహాయంతో రూ.2 వేల నోట్లను మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాల దగ్గర కూడా ఈ నోట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేక అప్లికేషన్‌ను పూర్తి చేయడంతో పాటు ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్ ను జత చేసి పోస్టాఫీస్ లో సబ్మిట్ చేయడం ద్వారా పాత రూ.2000 నోట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి రూ.20,000 మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఆర్బీఐ ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన నేపథ్యంలో ఇప్పటివరకు రూ.2000 నోట్లను కలిగి ఉన్నవాళ్లు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిదని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ లను సంప్రదించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2000 నోట్లను ఇప్పుడు మార్చుకోకపోతే భవిష్యత్తులో మార్చుకునే ఛాన్స్ కూడా ఉండదు.

2000 రూపాయల నోట్లు ఎక్కడైనా ఉండి పొరపాటున మార్చుకోవడం మరిచిపోయిన వాళ్లకు ఈ విధానం ద్వారా ఎక్కువగా బెనిఫిట్ కలుగుతుంది. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే 2,000 రూపాయల నోటును మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.