శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుందో మీకు తెలుసా.. చెడు జరుగుతుందా?

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో శరీరంపై బల్లి పడటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలోని కొన్ని భాగాలపై బల్లి పడితే మేలు జరుగుతుంది. మరికొన్ని భాగాలపై బల్లి పడితే మాత్రం ఎక్కువ నష్టం కలుగుతుందని చెప్పవచ్చు. బల్లి శరీరంపై ఎక్కడ పడినా వెంటనే స్నానం చేసి దేవుడిని పూజిస్తే మంచిది. బల్లి శకునాన్ని విశ్వసించే వాళ్లు దేశంలో చాలామందే ఉన్నారు.

పురుషులు, స్త్రీలలో బల్లి పడితే ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. మహిళల ఎడమ భాగంపై బల్లి పడితే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉండగా పురుషుల కుడి భాగంపై బల్లి పడితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పగటి సమయంలో బల్లి పడితే మాత్రమే ప్రభావం ఉంటుందని రాత్రి సమయంలో బల్లి పడితే మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పవచ్చు.

పురుషుల ముఖంపై బల్లి పడితే భారీ స్థాయిలో సంపద వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పురుషుల తలపై బల్లి పడితే వివాదాలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. బల్లి కుడి కంటిపై పడితే అనుకున్న పనులు జరగవు. ఎడమ కంటిపై పడితే మాత్రం గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బల్లి రెండు పెదవులపై పడితే మరణం, పై పెదవిపై పడితే గొడవలు, కింది పెదవిపై పడితే ఆర్థిక లాభం చేకూరే ఛాన్స్ అయితే ఉంటుంది.

మణికట్టుపై బల్లి పడితే చేయాల్సిన పనులలో విభజన జరిగే అవకాశం ఉంటుంది. కలలో బల్లి కనిపిస్తే ఒక పనికి సంబంధించి భయం పట్టుకుంటుందని చెప్పవచ్చు. బల్లి వెనుక భాగంలో పడితే సక్సెస్ దక్కుతుంది. బల్లి నోటిపై పడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీసాలపై పడితే సమస్యలు, తొడలపై పడితే వస్త్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. పురుషుడి చేతిపై బల్లి పడితే ఆర్థిక నష్టం కలిగే ఛాన్స్ ఉంటుంది. ఎడమ చేతిపై బల్లి పడితే అవమానాలు ఎదురవుతాయని కుడిచేతిపై పడితే కష్టాలు వస్తాయని సమాచారం.